Categories
పిల్లలున్న ఇళ్ళల్లో ఇంటి గోడల్ని పెన్సిల్ గీతాలు బొమ్మలు గెసి పాడుచేయకుండా కనిపెట్టుకుని వుండటం చాలా కష్టం. వాళ్ళ ద్రుష్టిలో గోడ చక్కని బ్లాక్ బోర్డ్. ఇష్టం వచ్చినట్లు గోడని పాడు చేస్తారు వాళ్ళు. అలాగే చక్కని ఇంటి గోడలపైన ఏ కారణం చేతనయినా మరకలు పడితే చేసేందుకు బావుండదు. పాత గోడల్లా అనిపిస్తాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం గా వచ్చింది. డై అండ్ ఎరేజ్ పెయింట్. ఈ రంగు పార దర్శకంగా వుంటుంది. దీన్ని ఇంటి గదల పైన వేసి ఆరనివ్వాలి. ఇక దాని పైన మరకలు గీతాలు పడిన చక్కగా చేరిపెయవచ్చు. దీన్ని పిల్లలు బ్లాక్ బోర్డ్ గా నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు.