పదేళ్ల వయసు వచ్చిన కూరలు,పాలు ,పండ్లు తినేందుకు ఇష్టపడరు చాలా మంది . ఎదిగే పిల్లలకు మాంసాహారం,పాలు చేపలు,బాదం,జీడిపప్పు,పప్పులు వాల్ నాట్స్ వంటివి ఇవ్వాలి . వాటిలోప్రోటీన్స్ ,విటమిన్స్ ఎక్కువగానే ఉంటాయి . దాంతో వయసు పిల్లలకు కావలసిన పోషకాలు లభిస్తాయి . కానీ వాళ్ళు పోష్టికాహారం తీసుకొనేందుకు ఇష్టపడకపోతే ,కొన్ని సూచనలు పాటించాలి పండ్లు వద్దంటే ఫ్రూట్ సలాడ్ గా ఇవ్వచ్చు . జ్యుస్ గా ఇవ్వచ్చు . పాలు ఇష్టపడకపోతే మిల్క్ షేక్ రూపంలో ఇవ్వాలి లేదా పాలతో తయారైన స్వీట్లు పెట్టచ్చు అలాగే కూరగాయలు  తినకపోతే వెజిటబుల్ ఆమ్లెట్ ,గ్రిల్డ్ వెజిటబుల్ శాండ్ విచ్ ఇలా రకరకాలు చేసి ఇవ్వాలి పిల్లలు అదే రూపంలో తినేందుకు ఇష్ట పడకపోతే వాటిని పిల్లలకు ఇష్టమైన పదార్దాల రూపంలోకి మర్చి ఇవ్వచ్చు కదా!

Leave a comment