Categories
మందులు వేసుకునేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తాం గాని సాధరణంగా ఇంట్లో చాలా వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. ప్రతి వస్తువు మనం రెగ్యూలర్ గా వాడేవి మార్చేయాలి. హెయిర్ బ్రెష్ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. ఏడాదికి ఒకసారి తీసేసి కొత్తవి కొనుక్కోవాలి. స్లిప్పర్స్ కుడా అంతే క్లీన్ చేస్తూ ఉండాలి. అరుగుదల ఎక్కువైతే మార్చాలి. బాత్ రూంలో వాడే స్పాంజ్ లు షవర్ పఫ్ పైన కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. వాటిని వేడి నీటిలో ముంచి శుభ్రం చేయాలి. మార్చాలి కూడా, టవల్స్, తలగడలు ప్రతి రెండేళ్ళకు మార్చాలి. టూత్ బ్రెష్ లు ప్రతి మూడు నెలలకు కొత్తవి తీసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు నిల్వా వుంటే సంవత్సరానికి ఒకసారైనా అవి అవతల పడేయాలి. ప్రతి వస్తువుకు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది.