ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో సాహసయాత్ర కు సిద్దం అవుతున్నారామె. 50 ఏళ్లు దాటిన తొమ్మిది మంది మహిళలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సాహసయాత్ర చేయబోతున్నారు ఈ యాత్ర ఐదు నెలలు సాగుతుంది 4625 కిలో మీటర్ల ఈ సాహస యాత్ర మార్చి 8న ప్రారంభమై ఆగస్టు లో ముగుస్తుంది. ఆరోగ్య స్పృహ ఈ విషయంలో అన్ని వయసుల వారికి స్ఫూర్తి ఇచ్చే యాత్ర ఇది అంటారు బచేంద్రిపాల్.

Leave a comment