వస్త్రంతో చేసిన మాస్క్ అయినా సర్జికల్ మాస్క్ అయినా వైరస్ అణువుల నుంచి రక్షణ ఇస్తాయి. కానీ మాస్క్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అలర్జీలు వస్తాయి. కళ్ళకు సంబంధించిన అలర్జీలు ఉన్నవాళ్లు మాస్క్ ధరించినా  కళ్ళజోడు పెట్టుకోవాలి.బయటకు వెళ్ళిరాగానే మాస్క్ శుభ్రంగా ఉతకాలి ఇలా చేస్తే మాస్క్ లో ఇరుకున్న దుమ్ము కణాలు ఎలర్జీ కారకాలు చర్మానికి అంటుకోవు. దురద కలిగించని పర్యావరణ హితమైన మాస్క్ లు ధరించాలి. ఉతికేందుకు కూడా ఫెర్ ఫ్యూమ్ రహిత సబ్బులను ఉపయోగించాలి. సర్జికల్ మాస్క్ లు దురదలు రానివ్వదు. గాలిలో ఉండే ఎలర్జీ కారకాలను నిలువరించటంలో కూడా మాస్క్ లు పనికి వస్తాయి.

Leave a comment