భూకంపాల పై రీసెర్చ్ చేసిన కాంచన అగర్వాల్ అతిసూక్ష్మ కంపనాలను పసిగట్టే రియల్ టైమ్ ఆటోమేటిక్ పి-వేవ్ డిటెక్టర్ ను తయారు చేసింది. దీని ద్వారా భూకంపాల గురించి కనీసం రెండు నిమిషాల ముందే ప్రజల్ని అప్రమత్తం చేయవచ్చు. అలాగే తీవ్ర నష్టాలను  కలిగించే అణు శక్తి రియాక్టర్ లు రవాణా వంటివి నిలిపివేయవచ్చు. ఆవిష్కరణకు 2019 జపాన్ అంతర్జాతీయ పోటీలో స్టూడెంట్ ట్రావెల్ గ్రాంట్ అవార్డ్ ను ఐ.ఐ.టి మద్రాస్ 2020 సదస్సులో బెస్ట్ ప్రజెంటేషన్ అవార్డ్ లను సాధించింది ఐ.ఐ.టి మద్రాస్ ఆచార్యులు అరుణ్ కె తంగిరాల కాంచన్ కు సహాయపడ్డారు. పరిశోధన ఖర్చును బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సైన్స్ భరించింది.

Leave a comment