కరోనా నుంచి రక్షించుకునే జాగ్రత్తల్లో మాస్క్ ధరించడం ఒకటి. పాటించే దూరం ఆరోగ్య స్థితిని బట్టి మాస్క్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న లేదా వస్త్రం తో తయారుచేసిన మాస్క్ ధరించాలి. ఈ మాస్క్ నాలుగు నుంచి ఐదు పొరలతో తయారై ఉండాలి.గాలి వడకట్టే లా ఉండటం తో పాటు కాటన్ తో తయారు చేసినదై ఉండాలి. క్యాబ్ ల్లో ఆటో ల్లో ప్రయాణించే వారు, ఆఫీసులకు వెళ్లే వారు ఇలాంటి మాస్క్ వేసుకోవాలి. కనీసం రెండు మీటర్ల దూరం కూడా పాటించలేని ప్రదేశాల్లో మెడికల్ మాస్క్ ధరించాలి. రెండు మీటర్ల సామాజిక దూరం కూడా పాటించే వీలు లేని ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా మెడికల్ మాస్కులు ధరించాలి.
Categories