కోవిడ్-19 కి సంబంధించిన సమాచారం తప్పని సరిగా తెలుసుకొంటు తగిన జాగ్రత్తలు పాటించమంటున్నారు వైద్యులు ఒక్కసారి దగ్గు జ్వరం వంటి లక్షణాలు కనిపించ కుండానే వైరస్ ప్రేవేశించి ఉండవచ్చు. మన పక్కనే ఉన్నవ్యక్తిలో వైరస్ ఉండేఉండచ్చు సాధారణంగా తుమ్మినా లక్షలాది వైరస్ లు ఇతరుల్లోకి చేరిపోతాయి. ముందు మాస్క్ లు తయారు చేసుకోవాలి మన ఇళ్ళలో ఉండే కాటన్ దుస్తులు బెడ్ షీట్లు పిల్లో కవర్లు టీ షర్టులు ఏవైనా సరే వాడి వాటి రెండు పొరలుగా కొట్టుకొని మాస్క్ లు తయారు చేసుకోవాలి. మాస్క్ లు ఎలా తయారు చేయాలో ఎన్నో వీడియోలు యూట్యూబ్ లో కనిపిస్తాయి,వాటిని వాడాక తప్పకుండ 70 డిగ్రీల దగ్గర ముప్పయ్ నిముషాల పాటు వేడి చేయాలి. గాలి వడబోయటం తో పాటు వైరస్ ను వ్యాపింప జేయకుండా చేయగలిగేవి మాస్క్ లు ఒక్కటే.

Leave a comment