తమిళనాడులో కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాస్కులు వేసుకోవటం తప్పనిసరి అన్న అవగాహన ప్రజల్లో కల్పించటం కోసం తమిళుల ఆరాధ్య దైవం మరియమ్మన్ అమ్మ అవతారం ధరించింది.ఈ సామాజిక కార్యకర్త తలపై కిరీటం కాళ్ళకు గజ్జెలు ధరించి వీధుల్లో నడుస్తూ ప్రజల దగ్గరకు వెళ్లి మాస్కులు వేసుకోమని చెప్పి వాటిని ఇస్తోందామే.వెనకే ఇద్దరు మహిళలు మాస్క్ లు పట్టుకోని ఆమెను అనుసరిస్తున్నారు.రహదారుల్లో ప్రజలను ఆపి కరోనా ప్రమాదాన్ని వివరిస్తోంది.గ్రామీణ ప్రాంతాల ప్రజల దేవత పేరు తో చెబితే వింటారు అనే నమ్మకంతో అమ్మవారి రూపధారణ తో మాస్క్ లు ఇస్తోంది కార్యకర్త.