ఇప్పుడు ఎంబ్రాయిడరీ మ్యాచింగ్ వడ్డాణాలు ట్రెండ్ చీరకు బ్లౌజు కుట్టినట్లే వడ్డాణాలు డిజైన్ చేస్తున్నారు అది మగ్గం, జర్దోసి, ఎంబ్రాయిడరీ లలో కుట్టి ఈ వడ్డాణాలు లో గిల్టెడ్ పూసలు రత్నాలు కుందనాల చొప్పించి బంగారు వడ్డాణం మాదిరిగానే టెంపుల్ జ్యువెలరీ డిజైన్లలో వినాయకుడు లక్ష్మీదేవి వంటి వన్ గ్రామ్ గోల్డ్ బిళ్ళలు జత చేస్తున్నారు చీరను చూసి దానికి తగ్గట్టు ఎంబ్రాయిడరీ బ్లౌజ్, మ్యాచింగ్ వడ్డానం డిజైన్ చేసి ఇస్తున్నారు. ఈ మ్యాచింగ్ బెల్ట్ ఫ్యాషన్ ఎప్పుడో, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు వాడేవారు అవే ఇప్పుడు పట్టు చీరల కి డిజైన్ చేస్తున్నారు. చీరకట్టు అలవాటు లేని అమ్మాయిలకు ఈ వడ్డాణం బెల్ట్మాటిమాటికీ సర్దుకో నవసరంలేకుండా చేసి ఎంతగానో నచ్చేసింది.

Leave a comment