కొన్ని పరిశోధనా ఫలితాలు వింటుంటే ఇవి ఎంత అవసరo అనిపిస్తుంది. మనుష్యుల్ని గురించి అర్ధం చేసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. తల్లిగా మారాక స్త్రీల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. ఇదే కాదు వారి మెదడు లోనే మార్పు వస్తుంది అంటున్నారు. పరిశోధకులు. 50 మంది తల్లి కాబోతున్న మహిళల పైన ఈ పరిశోధన చేశారు. ప్రసవానికి ముందు వారి మెదడు స్కాన్ చేశారు. గర్భం దాల్చిన తర్వాత వచ్చిన స్పష్టమైన మార్పును పరిశోధకులు గుర్తించారు. ఇతరుల అభిప్రాయాలను, అవసరాలను గమనించే మెదడు భాగంలో వచ్చిన మార్పు అమ్మలో అప్రమత్తతను పెంచేలా వుందిట. పసిపిల్లలు నోరు తెరిచి ఏదీ అడగకపోయినా వారి ఆకలిని, నిద్రను, అనారోగ్యాన్ని తెలుసుకొనే శక్తి ఈ మార్పు ద్వారా తల్లికి లభించిందని పరిశోధకులు చెప్పారు. రెండు మూడేళ్ళ తర్వాత ఆ మెదడు సాధారణ స్థాయిలో అంత అలెర్ట్ గా లేకుండా ప్రశాంతతతో ఉందిట. నిజమే ఏ శక్తితో బిడ్డ అవసరాన్ని చటుక్కున తెలుసుకొంటోంది తల్లి. ఈ పరిశోధన చాలా గొప్పగా ఉంది.
Categories