Categories
ఒక్కసారి కోవిడ్ వచ్చి తగ్గాక ఇక మనకేం ప్రమాదం లేదు మన జోలికి రాదు అనుకునేందుకు వీలు లేదంటున్నారు డాక్టర్లు. కోవిడ్ రీ ఇన్ఫెక్షన్ పొంచి ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. సమర్థవంతమైన టీకా వచ్చేదాకా అప్రమత్తంగా ఉండవలసిందే.కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డాక శరీరంలో యాంటీబాడీస్ తయారైనప్పటికీ అవి ఎంత కాలం రక్షణ ఇస్తాయో తెలియదు.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 3 నుంచి 9 వారాల్లో శరీరం యాంటీబాడీలు తిరిగి పోతాయి కనుక ఇన్ఫెక్షన్ కు గురికాకుండా తప్పనిసరిగా రక్షణ చర్యలు దీర్ఘకాలం కొనసాగించాలి.