Categories
మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మెదడు చురుగ్గా ఉండాలి.మెదడు చురుకు దనం కోసం కొన్ని పదార్థాలు నచ్చిన నచ్చకపోయినా తినాలి. అవకాడో తింటే మెదడు చురుగ్గా ఉండటమే కాకుండా తార్కిక ఆలోచన కూడా పెరుగుతోంది.మెదడుకి రక్త ప్రసరణ బాగా జరుగుతోంది. వాల్ నట్ మెదడుని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.బాధం వాల్ నట్స్, జీడిపప్పు,పిస్తా పప్పు తింటే మెదడు ఉత్సహాంగా పని చేస్తుంది.బ్రకోలీలో ఉండే మిటమిన్ కె ఆలోచన శక్తిని పెంచుతుంది.కొలైన్ అనే అత్యవసరమైన పోషకం బ్రకోలీలో దొరుకుతుంది.సాల్మన్ చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాట్ ఆమ్లాలు మెదడుని ఆరోగ్యంగా ఉంచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. డార్క్ చాక్లేట్స్ లోని ప్లేవనాయిడ్స్ మెదడుని ఉత్సహాపరుస్తుంది.