నీహారికా,
కొన్ని విషయాలు చిత్రంగా ఉంటాయి. మెదడులో ఎన్నో ఆలోచనలు వచ్చిపోతునే ఉంటాయి. వాటిని అదుపు చేయడం చాలా కష్టం. ఫోన్ లో ఫోటోలు డిలీట్ చేసినట్లు మెదడుకు ఆ వ్యవస్థ ఏవీ లేదు. మరి దండగా మారి ఆలోచనలు ఎలా తీసేస్తాం. ఇప్పుడు ఎక్స్ పార్ట్స్ ఓ సలహా ఇస్తున్నారు. ఏదయినా మళ్ళి మళ్ళి మెదడు రిమైండర్ జీరో చేస్తుంటే ఆ విషయాన్ని పేపర్ పైన రాసుకోమంటున్నారు. అప్పుడు ఆ రాసింది చదువుకుంటే బిజీగా వుంటే మెదడుకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ ఆలోచన హేతుబద్దంగా వుండా అనవసరమా అని తేల్చుకుంటుంది. ఏ లాజిక్ కు అందని ఆలోచనలు దండగే అని మనస్సు గ్రహించి మెదడుకి ఆ సలహాని పంపిస్తే అప్పుడు ఆ గందరగోళం పోతుంది. అంటే మనల్ని విసిగించే విషయాలని మెదడు లోంచి పంపించ లేకపోతే ఇలా పేపర్ పైన రాసుకుంటే మనకో క్లారిటీ వచ్చి దాన్ని గురించి అలోచించాలా? వేస్టా అన్న విషయం తేల్చుకోగలుగుతుమన్నమాట. అంటే ఒక్కసారిమన మెదడే మన మాట విన నట్లేగా!