పిల్లల ఆరోగ్యం కోసం వారి ఆహారంలో పీచులతో కూడిన పదార్థాలు ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి వాళ్ళకి నచ్చేలా ఉండాలి . గోధుమ పిండి గానీ ఓట్స్ గానీ ఉపయోగించి కుకీస్ తయారు చేసి ఇవ్వచ్చు . ఎప్పటికప్పుడు తాజాగా తరిగిన పండ్ల ముక్కలు సిద్ధం చేసుకొని వాటిని ఏదో రూపంలో అయినా పిల్లలు తినేలా చేయవచ్చు . వీలైతే పెరుగుతో,పాలతో ఇవ్వచ్చు. వెన్న లేకుండా పాప్ కార్న్ తయారు చేయవచ్చు. మొక్క జొన్న విత్తులు కుక్కర్ లో ఉడికించి ఇచ్చిన శ్రేష్టం . తాజా పెరుగులో అరటి పండ్లు, ద్రాక్ష ,కిస్ మిస్ , డ్రైఫ్రూట్స్ కలిపి రుచిగా ఉండే సలాడ్ ఇవ్వచ్చు. పండ్లరసాల కంటే గుజ్జు చేసి ఇవ్వటం ముఖ్యం. బాగా ఉడికించిన కూరగాయలు కూడా పిల్లలకు మేలు చేస్తాయి.

Leave a comment