Categories
మోనోపాజ్ కొందరికి చిన్నవయస్సులోనే రావచ్చు. అలా ముందుగా వచ్చేస్తే గుండె జబ్బుల ఆస్కారం పెరుగుతుందనీ, ఎముకలు బలహీనంగా అవుతాయని సంతాన సాఫల్యత ఉండదని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇవన్నీ లేకుండా మోనోపాజ్ సరైన సమయంలో రావాలంటే మంశాకృతులున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చెప్పుతున్నారు అధ్యాయినకారులు. మాంసకృతులు, మాంసాహారం నుంచి ఎక్కువగా అందిన శాకాహార భోజనం వల్ల అందె మాంసాకృతుల వల్ల మాత్రమే సరైన సమయానికి మోనోపాజ్ వస్తుందని అధ్యాయినాలు తేల్చాయి. అందుకే సోయాపాలు, సోయాకీమా, పప్పులు ఎక్కువగా తీసుకోవాలనిచెప్పుతున్నారు. తృణ ధాన్యాలతో చేసిన పాస్తా, బ్రెడ్ వంటివి తీసుకున్నా సరే మోనోపాజ్ తినే ఆహారంలో కనీసం ఆరు శాతం మాంసాకృతులు ఉండేలా చుసుకోమ్మని సలహా ఇస్తున్నారు.