కొందరికి చిన్న వయస్సులోనే జుట్టు నేరిసిపోతుంది. నెరసిన జుట్టు మళ్ళి నల్లగా అయిపోవాలంటే కొన్ని చిట్కాలు పాటించొచ్చు. కరివేపాకు జుట్టును నల్లగా మార్చేయడమే కాదు జుట్టు పెరిగేలా కూడా చేస్తుంది. కప్పు మజ్జిగలో పెద్ద చెంచాడు కరివేపాకు పొడి కలిపి కుదుళ్ళ నుంచి పట్టించాలి. అరగంటాగి తేలికైన షాంపు తో తలస్నానం చేస్తే చాలు లేదా నూనె లో కరివేపాకు మరిగించి ఆ నునేను మాడుకు పట్టించి అరగంట పాటు ఆగి షాంపూ చేస్తే చాలు. మంచి ఫలితం వుంటుంది. అలాగే ఉసిరికాయ జుట్టును నల్లగా మార్చడంతో పాటు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉసిరి వాడటం వల్ల వెంట్రుకలు తెల్లబడటాన్ని తగ్గించ వచ్చు. బంగాలదుంప కూడా సహజ రంగుగా పనిచేస్తూ జుట్టును నిగనిగ లాడేలా చేస్తుంది. నాలుగైదు బంగాళా దుంపలు పొట్టు తీసి వేడి నీటిలో ఉడికించి చక్కగా రసంగా చేసుకోవాలి. దీన్ని చల్లారనిచ్చి కొన్ని చుక్కల కొబ్బరి నూనె కలిపి ఓ సీసాలోకి తీసుకుని తీసుకుని ఆ రసం తలంతా రాసుకుని కాసేపయ్యాక కడిగేయాలి.
Categories