గాజు పాత్రలో దేన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. చూసేందుకు, పదార్థాలను నిల్వ చేసేందుకు చక్కగా ఉంటాయి. కానీ ఈ గాజు పాత్రల పై నీటి మరకలు పేరుకుపోయి ఒక పట్టాన వదలవు. టీ స్పూన్ బేకింగ్ సోడా టీ స్పూన్ వైట్ వెనిగర్ కలిపి ఈ మిశ్రమాన్ని గాజు పాత్ర పై పేర్కొన్న నీటి మరకలు పై రాసి అరగంట అలా వదిలేయాలి తర్వాత రుద్ది కడిగేస్తే చాలు పాత్రలు మెరుస్తూ శుభ్రంగా ఉంటాయి. బాగా శుభ్రం చేసి వాడుకుంటే ఈ పాత్రలు ఎంతో కాలం కొత్తవాటిలా మెరుస్తుంటాయి.

Leave a comment