ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ పత్రిక లో ఈ ఏడాది మెకంజీ స్కాట్ అగ్రస్థానంలో నిలిచారు 2019 లో భర్త నుంచి విడి పోయాక సంక్రమించిన ఆస్తిలో సగమైనా దానధర్మాలకు వినియోగిస్తానని ప్రకటించి రెండేళ్లలోపే ఆచరణలో పెట్టారామె. 8.6 బిలియన్ డాలర్లను ప్రపంచ వ్యాప్తంగా 780 సామజిక సేవ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆమె దానం చేసిన మొత్తం 2. బిలియన్ డాలర్లు. రచయిత్రగా అమ్మగా నలుగురు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే యాంటీ బుల్లీయింగ్ గ్రూప్ ను ప్రారంభించారు మెకంజీ స్కాట్.