మనకి మూడు రకాలైన ఆకళ్ళు ఉంటాయని మనస్థత్వ శస్త్ర వేత్తలు చెపుతున్నాయి. ఒకటి జీవన వ్యవస్థను నడిపించే ఆకలి, భావోద్వేగపరమైన ఆకలి, సామాజికమైన ఆకలి. మొదటిది ఆకలేస్తే అలవాటుగా తినేసే ఆకలి, భావోద్వేగ ఆకలంటే సంతోషం కలిగినా, చుట్టాలోచ్చినా, ఒంటరితనం అనిపించినా, ప్రతి ఉద్వేగాన్ని ఆకలితో ముడిపెడతాం, ఇక పోతే సామాజికమైన ఆకలి సమాజంలో మనకు ఎదురయ్యె, చూసే అలవాటు చేసుకునే ఆకలి, టివి లో క్రికెట్ చూస్తూ పిజ్జా ఆర్డరు, సినిమాకు పొతే పాప్ కార్న్, కూల్ డ్రింక్, రెస్టారెంట్ కు వెళితే స్టార్టర్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దాకా సమస్తం స్వాహా చేసే ఆకలి. కొన్ని వాణిజ్య ప్రకటనలైతే ఫలానావి తింటే అధునికులైనట్లు, ఆనందంగా వన్నట్లు భ్రమ కలుగుతుంది. అసలు రుచి కంటే మన మనస్సు చేసే మాయ మన డబ్బుని ఖర్చు చేయిస్తుంది. అందుకే ఆహార మనస్తత్వ శాస్త్రం అధ్యయినం చేస్తేనే మనం తిండి పోటులు కాకుండా వుంటారు. మనస్సు పైన పట్టు సాధించి ఆకలిని అర్ధం చేసుకుని శరీరాన్ని గమనించుకుని తేలికగా కడుపు నిండటం అంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అలవరుచుకోవాలి అన్నమాట. అంటే ముందు మనస్సుని సంతృప్తితో నింపేస్తే అది అతి తిండిని కంట్రోల్ చేస్తుందన్నమాట.
Categories