Categories
మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ సమస్య ఉంటే క్రీములు లోషన్లు కన్నా పుదీనా చక్కని పరిష్కారం అంటారు సౌందర్య నిపుణులు. దీన్ని వేసవి పానీయంగా ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల దీని ప్రభావం కొంతవరకు చర్మం పైన ఉంటుంది దీని తో చక్కని స్క్రబ్ తయారు చేసుకోవచ్చు పావు కప్పు పుదీనా ఆకులు టేబుల్ స్పూన్ చొప్పున ఓట్స్, కీర రసం, తేనె కలిపి మెత్తని పేస్టులాగా చేసి దానికి కాస్త గులాబీ నీరు కలిపి, మచ్చలున్న చోట రాసి మృదువుగా రుద్ది, ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీళ్లతో కడిగేయాలి ఇలా వారానికి నాలుగైదు సార్లు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి