ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలి ఇప్పుడు  అలుబుఖారా సీజన్ కూడా ఫ్లమ్ పళ్ళ జాతుల్లో ఒకటి. వీటిలో విటమిన్ సి పొటాషియం నీటిశాతం చాలా ఎక్కువ శరీరంలోని మలినాలను తొలగించటం లో కీలక పాత్ర పోషిస్తాయి. అతి నీల లోహిత కిరణాల వల్ల శరీరానికి కలిగే హానిని అడ్డుకుంటాయి సాయంకాలం వేళ ఈ పండ్లు జ్యూస్ తాగితే మంచిది అంటారు పోషకాహార నిపుణులు. వీటిల్లో ఉండే పొటాషియం బిపిని తగ్గిస్తుంది  అలుబుఖారా లోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం మెరుపును సంతరించుకొనేలాగా చేస్తాయి.  నలభై దాటిన మహిళలు వీటిని రోజూ తినడం వల్ల అందులోని కే విటమిన్ ఎముకలు బలహీనం కాకుండా చేస్తుంది.ఈ సీజన్ లోనే కాకుండా డ్రైఫ్రూట్స్ గా ఎప్పుడు తినవచ్చు.

Leave a comment