పెళ్లయిన పదమూడేళ్ల తర్వాత మిసెస్ ఇండియా కిరీటాన్ని అందుకొన్నది తెలుగమ్మాయి విజయవాడ కు చెందిన బిట్ల పాటి మల్లిక 2020 లో మిస్సెస్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో రన్నరప్ గా నిలిచారు. తర్వాత రోజుకు నాలుగు గంటలు జిమ్ లో గడిపి దేశవ్యాప్తంగా ఎందరో పోటీపడిన 2021- 22 మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొని తుది జాబితాలో నిలిచింది మల్లిక. ఇటీవల ఉదమ్ పూర్ లో జరిగిన తొమ్మిదవ సీజన్ పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో వంటల రౌండ్ లో చలిమిడి చేసి ఉత్తర భారతీయులకు పరిచయం చేశారామె. మరో రౌండ్ లో కొండపల్లి గాజులను పరిచయం చేసి న్యాయనిర్ణేతల ను ఆకర్షించింది. మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుంది మల్లిక బిట్ల పాటి.

Leave a comment