Categories
ఏ సందర్భానికి అయినా సరిపోయే డిజైన్ ఒక్క మిక్సిడ్ ప్రింట్స్ అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్ .జామెంట్రీ కల్ డిజైన్ లలో పూలు గళ్ళు కలిసి వచ్చే క్రాప్ టాప్స్ రోజు వారి డ్రెస్ గానే కాదు సాయం కాలపు వెళల్లో బయటకు వెళ్లేందుకు బావుంటాయి. లేత వర్ణాల్లో పూలు ,గళ్ళు ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి .జీన్స్ పైకి మోకాళ్ల వరకు వచ్చే మిడీ లకు నప్పుతాయి. నిలుపు లేదా అడ్డగీత పూలుండే డిజైన్స్ ఇప్పుడు క్రాఫ్ టాప్ పడవు గౌన్ల పై కనిపిస్తూ ఉన్నాయి. కోల్ట్ షోల్డర్ తో రఫెల్స్ ఉండే గౌన్లు బావుంటాయి .టీ షర్ట్ లు క్రాఫ్ట్ టాప్ లకు రెండు వైపులా గీతలు ముందు వెనకా పెద్ద పూల డిజైన్లు కలయిక కూడా ఇప్పుడు ట్రెండ్ .గళ్ళు, చుక్కలు, పూలు అన్నీ కలిపిన డిజైన్లు కాటన్, సిల్క్ వస్త్ర శ్రేణి లోనూ బావుంటాయి. సల్వార్ సూట్స్, లెహంగా లు కుర్తీ లకు ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. పార్టీ వేర్ కోసం అయితే దుస్తులు శరీరానికి అతుక్కునేలా పొడవాటి గౌన్లు అయితే చక్కగా ఉంటాయి. వేరే అదనంగా నగలు కూడా అక్కర్లేకుండా ఉంటాయి. మిక్సిడ్ ప్రింట్స్ లెహంగా లకు కూడా ప్రయత్నం చేయొచ్చు . జీన్స్ లేత వర్ణం టీ షర్ట్ పైన గీతలు పూల మేళలింపు తో బ్లేజర్ లేదా జాకెట్ పార్టీ వేర్ గా చక్కగా ఉంటుంది. సాయంత్రపు పార్టీ లకు మిక్సిడ్ డిజైన్ చీరెలు కూడా ఎంచుకోవచ్చు .ఇలాంటి చుక్కలు, పూలు, గళ్ళు కలిసిన ట్రెండ్స్ ఏ సందర్భానికైనా మెరుపులు మెరుస్తాయి .