Categories
ఛత్తీస్ ఘఢ్ ప్రభుత్వం దాయ్ దీదీ క్లినిక్ పేరుతో గ్రామీణ మహిళల ఆరోగ్యం కోసం ఒక మొబైల్ ఆస్పత్రిని ప్రారంభించింది.నిరుపేద మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు అవసరమైతే వైద్య సేవలు అందించేందుకు ఇందులో సిబ్బంది సిద్ధంగా ఉంటారు. వైద్య సిబ్బంది మొత్తం మహిళలే.పరీక్ష అనంతరం రోగులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందేలా చేస్తారు.అలాగే మాతా శిశు ఆరోగ్యాభివృద్ధి దిశగా ప్రభుత్వం అందించే పథకాలను వీరు పొందవచ్చు. ఈ మొబైల్ ఆస్పత్రిలో పారామెడికల్ సిబ్బంది టెక్నీషియన్, నర్స్ అందరూ మహిళలే కావడం ప్రత్యేకం.