నీహారికా , స్నేహంలో ఎంత జాగ్రతగా ఉంటున్నా ఎందుకో ఎదో ఒక మాటకు అపార్ధాలు వస్తుంటాయి. నేను కరెక్ట్ గానే మాట్లాడననుకుంటాను. అన్నావు. సరే అవతలివాళ్ళు అలాగే అనుకుంటారు కదా నీహారికా. మానవ సంబంధాలలో మంచిని గుర్తించి వప్పుకోకపోతే వ్యతిరేకాంశాలే కదమ్మా మిగిలేవి. ఈ వ్యహాతిరేకాంశాలను ఎప్పటికపుడు బలహీనపరచాలి. ఆలా మొగ్గలోనే తుంచకపోతే చివరకి సంబంధ మూలాలనే తినేస్తాయి. పరిషారం మన మనసులోనే ఉంది. మనసుని ఎప్పుడైతే అద్దం లా ఉంచుకుని మనసు తలుపులు తెరచి ఎదుటివాళ్ళు అభిప్రాయాలూ ఆహ్వానిస్తారు. అప్పుడు సంబంధాలు చెడిపోవు. మనం సంఘ జీవులం నీహారికా. ఎదుటి వాళ్ళను ఏ చిన్నరూపంతోనో పంతాలు పట్టింపులతోనో దూరం చేసుకుంటే నష్టపోతాం. నీ మనసులో ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందీ అంటే నీ స్నేహితురాళ్ళతో వచ్చే చిన్నపాటి ఘర్షణకు దూరాన్ని ఇష్టపడలేకనే కదా. మనకి చాలా కావాలి. తినేందుకు ఉండేందుకు సౌకర్యాలు మాత్రమే కాదు. మానవుల సాహచర్యం ప్రేమ కావాలి. మన మనసు సరదాలు సంతోషం పంచుకునే మిత్రులు ఆప్తులు కావాలి. అప్పుడే జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మంచి దృశ్యమో ఫోటో విన్నప్పుడు దాన్ని ఇతరులతో చెప్పుకోకపోతే ఎంత బావుందో చూడమని మన కళ్ళు చూసిన అందాన్ని పంచకపోతే సంతోషం ఎలా వస్తుంది. ఎవరితో ఏ సంబంధమూ లేని ఎడారి వంటి జీవితం మనం కోరుకోవాలా ? అసలు మనుషుల సందడే నమ్మా జీవితం అంటే!!
Categories