Categories
Soyagam

మొలకెత్తిన గోధుమలతో గోళ్ళకు బలం

గోళ్ళు విరిగిపోతూ వుంటాయి. మెత్తగా వంగిపోతాయి. అవి బలంగా, ఆరోగ్యంగా, అందంగా వుంటే వాటిని అలంకరించే ఎన్నో సాధనాలు మార్కెట్ లో ఉన్నాయి. కొన్ని ఆహార పదార్ధాలు గోళ్ళు ధృడంగా అందంగా వుండేలా చేస్తాయి. అందులో భాగంగా మొలకెత్తిన గోధుమలలో విటమిన్ బి6, విటమిన్ ఇ, ప్రోటీనులు, జింక్ వుంటాయి. ఈ మొలకల్ని యధాతధంగా తినలేకపోతే పూరీల పిండిలో, సెరల్స్లో, పెరుగులో, సలాడ్ లో, పాన్ కేక్లో, ఫ్రూట్ కేక్ లో కలుపుకుని తాగచ్చు, తినచ్చు. వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఒకటి రెండు రోజులు బావుంటాయి. అలాగే ఓట్స్ లో విటమిన్ బి, మాంగనీస్, సిలికాన్, జింక్, రాగి మొదలైన ఆరోగ్యవంతమైన పోషకాలు గోళ్ళకు బలాన్నిస్తాయి. ఈ ఓట్స్ ని తినే ముందర కొంచెం సేపు నానబెడితే సైటిక్ ఆమ్లం తటస్థ స్థితికి వస్తుంది దానివల్ల పోషక విలువలు పెరుగుతాయి.

Leave a comment