పెదవులపై పుష్పించే దేవతా పుష్పం ఓ చిరునవ్వు అన్నాడొక కవి. ఆరోగ్యవంతమైనదీ మనసుకి హాయినిగొలిపేది అయిన నవ్వుని ఆభరణం అంటారు అమెరికన్లు. ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించేది చిరునవ్వే అని గాఢంగా విశ్వసిస్తారు . పెదవులపై నృత్యంచేసే ప్రవర్తనా సందేశం చిరునవ్వు అంటారువాళ్ళు.   ఇంత చక్కని నవ్వుని రోజుకి 500 సార్లు గనక నవ్వగలిగితే ఎలాంటి అనారోగ్యం ఉండదట. ఈ ప్రపంచంలో మనల్నీ మార్కెట్ చేసేది కూడా నవ్వేనంటారు. సుఖాలను ,దుఃఖాలను ఒకే రీతిగా తీసుకొని నవ్వేవారు అదృష్టవంతులు. నవ్వలేక పోతే ప్రపంచంలోని సంబంధాలు అన్నీ పోగొట్టుకొన్నట్లే.

Leave a comment