Categories
చిరుధాన్యాలు ఆరోగ్యం అని ఈ మధ్య అన్ని చోట్ల వినిపిస్తుంది.ఇవి వండుకునే పదార్ధాలని పుస్తకరూపంలో ప్రచారం జరుగుతుంది.ఉప్మాలు పాయసం మాత్రమే కాకుండా వీటిని మొలకెత్తించి పిండిగ చేస్తే ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటున్నారు.జొన్నలు,అరికెలు,సామలు,ఊదలు,సజ్జలు,కొర్రలు మొలకెత్తించి వాటిని పిండిగ చేసి ఎన్నో రకాల పిండివంటలు వందుకోవచ్చు.కొత్త కొత్త ఆహారాన్ని కలుపుకునే అలవాటు మనకు ఎఫ్పుడు ఉంది కనుక ఈ చిరు ధాన్యాలు కాస్త కష్టపడి నానబెట్టి మొలకెత్తించి ఆరోగ్యపరమైన పిండివంటలు వండితే అందరికి ఆరోగ్యమే.