నానబెట్టిన సెనగలు అరటిపండు తాంబూలం ఇవన్నీ శ్రావణ మాసపు నోముల్లో ముత్తయిదువులకు ఇచ్చే వాయినంలో కనిపిస్తాయి. డాక్టర్లు ఏమంటున్నారంటే సెనగలు లక్ష్మీ ప్రసాదం మాత్రమే కాదు ఇందులో బోలెడన్ని ప్రోటీన్స్ పొటాషియం మాంగనీస్ జింక్ విటమిన్ కె వంటి నిల్వలు పుష్కలంగా వున్నాయి. కనుక ప్రతి రోజు ఆహారంలో తినండి అంటున్నారు. పీచు విటమిన్ సి విటమిన్ బి6 ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పండ్లు కూరగాయల్లో సెలెనియం ఖనిజం అంతగా దొరకదు. సెనగల్లో పుష్కలంగా దొరికే సెలీనియం కాన్సర్ లు రాకుండా కాంతులు పెరగకుండా కాపాడుతుందంటున్నారు. అలాగే డిఎస్ఏ తయారీకి కారణమయ్యే ఫోలేట్ కూడా ఉంటుంది. నిద్రకీ కండరాల కదలికకు అధ్యయనానికి జ్ఞాపక శక్తికీ ఎంతో అవసరమైన కొలీన్ కూడా ఉంటుంది. కనుక సెనగల్ని పచ్చిగా అంటే నానబెట్టి లేదా ఉడికించి రెగ్యులర్ గా కూరల్లో వేసి ఎదో రకంగా ప్రతి రోజూ తినమంటున్నారు.
Categories
Wahrevaa

విటమిన్లు ఖనిజాల నిండుగా వుండే సెనగలు

Leave a comment