Categories
కేరళకు చెందిన కళాకారిణి Moozhikkal Pankajakshi కి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు లభించింది . ఆమె పెదవి పైన తోలు బొమ్మను నిలబెట్టి రామాయణ ,మహా భారత కథలను నాలుకతో ఆడించగలదు . తల్లిదండ్రులు ఆమెకు నేర్పిన ఈ మాల్కవిద్యా ‘ పవక్కలి ‘తన 12వ ఏట నుంచే కాపాడుతూ వస్తున్నారు . కేరళలోని మోనిపల్లి తాలూకా కొట్టాయింకు చెందిన పంకజాక్షి భర్త శివరామ పాణిక్కల్ కూడా కళాకారుడే . ఐదు వందల సంవత్సరాల నాటి విద్యను ఈ శతాబ్దంలో ఇప్పటికీ సజీవంగా ఉంచగలిగిన ఏకైక కళాకారిణి పంకజాక్షి . ఆమె మనుమరాలు కె.ఎస్ .రంజని కూడా ఈ కళను కొనసాగిస్తోంది .