Categories
జుట్టు ఆరోగ్యంగా వుంచుకునేందుకు కుంకుడు కాయలు ఉపయోగించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఇవి వంద శాతం సహజసిద్ధమైనవి.ఈ రసం పురుగులు దోమలు రాకుండా నివారిస్తుంది కూడా. వీటిల్లో విటమిన్ ఎ,డి,ఇ,కె ఉండటం వల్ల వీటిని వాడితే ఎన్నో లాభాలు ఉంటాయి. కుంకుడు కాయలతో వారానికి ఒకసారి తలస్నానం చేయాలి స్నానం తర్వాత తప్పనిసరిగా కండిషనర్ పెట్టుకోవాలి. జుట్టు తడి పొడిగా ఉన్నప్పుడే షియా బటర్ రాసుకోవాలి. ముందు రోజు రాత్రి గోరువెచ్చని నూనెతో జుట్టు సున్నితంగా మసాజ్ చేసి ఉదయాన్నే కుంకుడు రసం తో స్నానం చేస్తే వెంట్రుకలు మృదువుగా ఆరోగ్యంగా ఉంటాయి.