బుల్లి పాపాయి ఇంట్లోకి రావడం ఒక ఉత్సవం లాంటిదే. కాని పాపాయి ని మోస్తూ తల్లి అనుభవించే ఇబ్బందిని వర్ణించడానికి మాటలుండవు. వేవిళ్ళతో కాబోయే అమ్మ సతమతం అవుతుంటే అప్పుడు ఆమెకు తేనె, అల్లం ఇవ్వండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. నిమ్మరసం,తేనె, అల్లం కలిపి ఒక్కో బొట్టు చప్పరిస్తే వికారం తగ్గుతుంది. అల్లంలో ఆరోగ్య విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా ఉప్పులో ఎండబెట్టిన అల్లం చప్పరించినా, అల్లం టీ తాగినా వికారానికి విరుగుడుగా పని చేస్తుంది. కూరలు,పప్పుల్లో అల్లం తురుము వాడినా మంచిదే. అల్లంతో జలుబు గొంతు నొప్పి తగ్గిపోతాయి. అల్లంలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అల్లంలో యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది. చక్కెర నియంత్రిస్తుంది ఆకలి పెంచుతుంది.

Leave a comment