ఇది చలికాలం కనుక వేడి నీటితో స్నానం చెయ్యడం గాఢత ఎక్కువగా ఉండే సబ్బులు వాడటం కాస్త వయస్సు ఎక్కువగా ఉంటే చర్మం పొడిబారుతుంది. ఒంట్లో తేమ తగ్గి చర్మం దురద పగిలిపోవడం జరుగుతుంది. పెట్రోలియం జెల్లీ మినరల్ ఆయిల్స్ వంటివి పై పూత గా ఉపయోగించడం వల్ల చర్మం తేమతో నిగారింపుగా ఉంటుంది. మరీ వేడి నీరు కాకుండా గోరువెచ్చని నీరు స్నానానికి ఉపయోగిస్తే చర్మం లోని సహజ సిద్దమైన నూనె పోకుండా వుంటాయి. సబ్బు సాధ్యమైనంత తేలికగా ఉండాలి. తేమ శతం ఎక్కువగా ఆల్కమాల్ గాఢత లేకుండా ఉండాలి. స్నానం చేసినవెంటనే తడిఆరిపోకముందే మాయిస్చురైజ్ రాసుకుంటే చర్మం తేమతో పొడిబారకుండా ఉంటుంది.

Leave a comment