కధా నాయికగా రీమా కల్లింగళ్ కు మంచి పేరుంది. ఎన్నో అవార్డులు , రివార్డులు వచ్చాయి. ముక్కు సూటిగా మాట్లాడే రీమా వివక్ష గురించి చాలా ఘాటుగా స్పందించింది. కొందరు ప్రొడక్షన్ కంట్రోలర్స్ లేడీ ఆర్టిస్టుల గదుల్లోకి వెళ్ళి వాళ్ళను చాలా విసిగిస్తారు. వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడవు. కంప్లయింట్. ఇచ్చినా మహా అయితే ఒకటి రెండు నెలల సస్పెన్షన్ తో వెనక్కి వచ్చేస్తారు. అంటుంది ఇటీవలి ఒక కార్యక్రమం లో ఆమె మాట్లాడుతూ నేను ఫెమినిస్టును స్త్రీ వాదం మొదలు అయ్యింది మా ఇంట్లోనే. మా ఇంట్లో కూడా మా నాన్న అన్నయ్యకే ప్రయారిటీ. నేను దాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకు నచ్చేది కాదు. ఇప్పుడు నేనునున్న ఫీల్డ్ లో ప్రశ్నిస్తే చాలా అవకాశాలు పోతాయి. కానీ నేను ఎలాంటి నిషేధాలు పట్టించుకోను. ఇలా మాట్లాడితే అందరికీ నచ్చదని నాకు తెలుసు అంటుంది రీమా.

Leave a comment