కాలేజీ చదువు పూర్తికాకుండానే ఫ్యాషన్ రంగంలోకి వచ్చాను స్టైలిష్ గా సినిమా రంగంలో నిలదొక్కుకోవాలంటే ఒత్తిడి ఎక్కువే కీర్తి సురేష్ రష్మిక, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ క్రీడాకారులు సింధు, శ్రీకాంత్ మొదలైన వాళ్లందరికీ వ్యక్తిగత డిజైనర్‌గా పని చేశాను.ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమా నిర్మాతగా మారటం వెనక ఆ కృషి ఎంతగానో ఉంది అతి చిన్న వయసు ఫ్యాషన్ డిజైనర్ ని బహుశా నేనే అనుకుంటూ అంటుంది శ్రావ్య వర్మ. ఫ్యాషన్ డిజైనింగ్ లో తనదైన ముద్ర వేసిన శ్రావ్య వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ అన్నీ నేనే డిజైన్ చేశాను.ఈ సినిమాను నవంబర్ లో ఓటిటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకుంటున్నాం అంటోంది శ్రావ్య వర్మ.