Categories
ఎన్నో రకాల ఇయర్ రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి.అయితే ముఖాకృతికి తగ్గవే తీసుకొమ్మంటారు స్టైలలిస్టులు. ఓవెల్ షేప్ ముఖాకృతి ఉంటే ఆ ముఖానికి ఏ మోడల్ ఇయర్ రింగ్స్ అయినా నప్పుతాయి. చెవులకు అంటినట్లు ఉండే దిద్దులు ,మెటల్ బీడ్స్ ,స్టోన్ హాంగింగ్స్ ఏ వయినా బావుంటాయి. స్క్వేర్ షేప్ మొహం అయితే మొహం ఆకారానికి పూర్తిగా విరుద్దంగా ఉంటే ఆభరణాలు ,పొందికగా ఉండేవి బావుంటాయి.రౌండ్ షేప్ అయితే సైజ్ ,పొడవు పైన దృష్టిపెట్టి మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పొడవు హాంగింగ్స్, ఓవెల్ షేప్ ,నలచరం లేదా ఒక దాని కింద మరోకటి వేలాడుతున్నట్లు ఉండే బీడ్స్ చాలా బావుంటాయి.