Categories
కూరలు, సాంబారులో ముల్లంగి చాలా బావుంటుంది. చూసేందుకు తెల్లగా పొడువుగా వున్న చప్పగా టేస్టి గా అనిపించదు. కానీ ఇందులో వుండే పోషకాలు మాత్రం ఎక్కువే ప్రతి కూరలో నూ ప్రతి కాంబినేషన్ లోనూ ముల్లంగిని తీసుకుంటేమూత్రపిండాలు పని తీరు శుభ్ర పడుతుందంటారు డాక్టర్లు ఎలాంటి ఇన్ ఫెక్షన్లు రావని చెపుతున్నారు. ముల్లంగిలో విటమిన్-సి, ఫాస్పరస్ బి-కాంప్లెక్స్ అధికంగా వుంది చెర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మానికి తేమ అందుతుంది. ముల్లంగి రసం శరీరంలో ఇన్ ఫెక్షన్లు పోగొట్టి అలసట దూరం చేస్తుంది. శ్వాస సంబందమైన సమస్యలున్న, అలర్జీలు చేధిస్తున్న ముల్లంగిలోని పోషకాలు తగ్గిస్తాయి.