Categories
సినిమా చూస్తుంటే చాలు పాప్ కార్న్ కావాలి పెద్దవాళ్ళకీ ,పిల్లలకీ కూడా అసలు నూనె కలపకుండా వేడి ఇసుకలో గుప్పెడు గింజలు పోస్తే తెల్లని పువ్వుల్లాగా పైకి వచ్చే పాప్ కార్న్ ప్రపంచంలో అందరికీ తెలిసినవే. ఈ పాప్ కార్న్ ఉన్న ఇమేజిని దృష్టిలో ఉంచుకొని ద్రాక్ష ,నారింజ ,అరటి,పైనాపిల్ వంటి పండ్ల ఫ్లేవర్లు సహాజ రంగుల్లోనూ వస్తున్నాయి. ఇప్పుడీ అన్ని రంగులు కలుపుకొని మల్టీకలర్ పాస్ కార్న్ కూడా మార్కెట్లో విడుదలైపోతుంది. అసలివి ఎలా చేసుకోవాలో, ఎలా రంగులద్దాలో ,తియ్యని పండ్ల రుచులు ఎలా తెప్పించాలో ఎన్నో వీడియోలున్నాయి. ఒకసారి చూసి ఇవన్నీ ఇంట్లోనే ట్రై చేయవచ్చు.