Categories
ఆటల్లో పడి పోవటం ,పిల్లలు కొట్టుకోవటం సహజం, కానీ ఆ చిన్న తననా తగిలే దెబ్బలు వారిపై దీర్ఘకాల ప్రభావం చూపెడతాయి అంటున్నారు వైద్యులు. ఆటల్లో తలకు గాయాలు తగులుతాయి . పొట్టలో పిడిగుద్దులు గుద్దుకొంటే అక్కడ దెబ్బలు తగులుతాయి. కర్రలు ,రాళ్ళతో కాళ్ళకు గాయాలు అవుతాయి. పిల్లలకు తప్పనిసరిగా ఈ అంగాల విషయం స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పాలి. కీలక అంగాలకు గాయం తగలకుండా చూసుకోమ్మని ముందే హెచ్చరించాలి. వాళ్ళంతట వాళ్ళను కపాడుకొనే వయసు వచ్చే దాకా పెద్ద వాళ్ళు కనిపెట్టి ఉండాలి.