Categories
ఇంట్లో ఎక్కువ గంటలు కూర్చోవటం శారీరక శ్రమ తక్కువగా ఉండటం ప్రీడయాబెటిస్ మొదలైన వన్నీ ఆకలికి కారణాలు కావచ్చు. శారీరక శ్రమ లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు ఊరికే ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.అందుబాటులో ఉన్న ఆహారం వైపు దృష్టి వెళుతూ ఉంటుంది. అలాంటప్పుడే క్యాలరీలు పెరిగి మధుమేహం కూడా పెరిగే ప్రమాదం వుంటుంది. కనుక ఆరోగ్యం కోసం హెల్తీ ఆప్షన్లు పెట్టుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు కు స్వీట్ లకు దూరంగా ఉండాలి. జామ కాయ పుచ్చకాయ ఆల్బుకార దానిమ్మ వంటి పండ్లు అందుబాటులో ఉండాలి. క్యారెట్ కీర వంటివి నమిలి తింటూ ఉండాలి.ఇంకా ఇతర పదార్థాలు తినాలి అనిపిస్తే పాప్ కార్న్ వేయించిన పుట్నాలపప్పు తీసుకోవచ్చు .