నీహారికా, ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ అంచనాలు లేకుండా పని మొదలు పెడితే ఇంతే. ముందు ఈ పని ఎంచుకోవడం కరక్టేనా, ఎంత సేపటిలో పూర్తి చేయగలం, అందుకు కావలసిన అవుట్ మన దగ్గర వుందా? ఇవన్నీ ప్రేశ్నలు వేసుకుని ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మన పైన కూడా మనకు అదుపు ఉండాలి. పని వేళల్లో ఫోన్లు, మెయిల్లు, ఫేస్ బుక్లు, అన్నింటికీ దూరంగా వుండాలి. ఇప్పటికే అధ్యాయినాలు, ఈ సాంకేతిక ఉదాహరణలు పని ఉత్సాదరతను తగ్గుతున్నాయని రిపోర్టులు అందుతున్నాయి. నాలుగైదు పనులు ఒకే సారి వస్తాయి. అప్పుడు ఇంతే ప్రాధాన్యత క్రమాలునిర్దేశించుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా చేయాలి. ఏది ముఖ్యం , ఏడి కొంత సేపు వాయిదా వేయవచ్చు ఇవన్నీ ఒక్క నిమిషంలో నిర్ణయించుకోవాలి. మెదడు తాజాగా వునప్పుడు కష్టమైన పని మొదలు పెట్టాలి. సరైన వేళకి పని పూర్తి చేయాలనే నిర్ణయం తో మొదలు పెడితే తేలికగా అయిపోతుంది. ఇలా ప్లాన్ ప్రకారం పని చేస్తారు కనుకనే కొందరే ముందు ఉన్నట్లు కనిపిస్తారు. పని ఎవరైనా చేయగల సమర్దులే. కానీ టైమ్ సెన్స్ పాటించాలి అంతే.
Categories
Nemalika

ముందు మన పైన మనకు అదుపు కావాలి

నీహారికా,

ఒకే పని అందరం మొదలు పెడతాం, కొందరే దాన్ని స్మార్ట్ గా పూర్తి చేస్తారు. మరి అందరి వల్లా ఎందుకు కాదు అన్నావు కరెక్టే. ఏ అంచనాలు లేకుండా పని మొదలు పెడితే ఇంతే. ముందు ఈ పని ఎంచుకోవడం కరక్టేనా, ఎంత సేపటిలో పూర్తి చేయగలం, అందుకు కావలసిన అవుట్ మన దగ్గర వుందా? ఇవన్నీ ప్రేశ్నలు వేసుకుని ఒక పనిని మొదలు పెట్టినప్పుడు మన పైన కూడా మనకు అదుపు ఉండాలి. పని వేళల్లో ఫోన్లు, మెయిల్లు, ఫేస్ బుక్లు, అన్నింటికీ దూరంగా వుండాలి. ఇప్పటికే అధ్యాయినాలు, ఈ సాంకేతిక ఉదాహరణలు పని ఉత్సాదరతను తగ్గుతున్నాయని రిపోర్టులు అందుతున్నాయి. నాలుగైదు పనులు ఒకే సారి వస్తాయి. అప్పుడు ఇంతే ప్రాధాన్యత  క్రమాలునిర్దేశించుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా చేయాలి. ఏది ముఖ్యం , ఏడి కొంత సేపు వాయిదా వేయవచ్చు ఇవన్నీ ఒక్క నిమిషంలో నిర్ణయించుకోవాలి. మెదడు తాజాగా వునప్పుడు కష్టమైన పని మొదలు పెట్టాలి. సరైన వేళకి పని పూర్తి చేయాలనే నిర్ణయం తో మొదలు పెడితే తేలికగా అయిపోతుంది. ఇలా ప్లాన్ ప్రకారం పని చేస్తారు కనుకనే కొందరే ముందు ఉన్నట్లు కనిపిస్తారు. పని ఎవరైనా చేయగల సమర్దులే. కానీ టైమ్ సెన్స్ పాటించాలి అంతే.

Leave a comment