ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో విజేతగా నిలబడింది మానస వారణాసి. నేను పుట్టిపెరిగిన హైద్రాబాద్ అంటే ఇష్టం బతుకమ్మ పండుగా రంజాన్ రాత్రులు ఎంతో చెప్పలేనంత ఇష్టం. హైద్రాబాద్ బిర్యానీ అమ్మమ్మ చేసే పెసరట్టు పులిహార కూడా.మోడలింగ్ లో అంత అవగాహనా లేని రోజుల్లో కూడా రాంప్ వాక్ చేసి విజేతగా నిలిచాను. ఆ తరువాత మోడలింగ్ పై ద్రుష్టి పెట్టాను. శాస్త్రీయ సంగీతం భరతనాట్యం నేర్చుకొన్నాను. టెన్నిస్ బాడ్మింటన్ ఆడగలను. మేక్ ఎ డిఫరెన్స్ స్వచ్చంధ సంస్థ తో కలిసి పని చేశాను. బస్తీల్లో నేను కలిసిన చిన్నారుల మాటలే నాకు స్ఫూర్తి అంటుంది మానస వారణాసి.

Leave a comment