విశ్రాంతి తీసుకోవడం అనుకుంటున్నారు కానీ అలా విశ్రాంతిగా ఐదారు గంటలు ఏ టీ.వి నో చూస్తూ గడిపితే భవిష్యత్తులో నడిచే శక్తి పోగొట్టుకుంటారు అంటుంది ఒక అద్యాయినం. 50 నుంచి 70 సంవత్సరాల వయసున్న 300 మంది పైన ఈ అద్యాయినం కొనసాగిందిట. ఈ 300 మంది రోజు వారీ కార్యక్రమాలు, వ్యాయామం, జీవనశైలి, విశ్రాంతిగా ఏ టి.వి నో చూసే సమయం జాగ్రత్తగా రికార్డు చేసారట. పది సంవత్సారాల కాలం జరిపిన ఈ అద్యాయినంలో 50 ఏళ్ళకు పై బడిన వాళ్ళు సాయంత్రం ఐడు గంటల నుంచి కనీసం ఐదు గంటల పాటు టి.వి చూసే అలవాటు తోనే వున్నారు. ఆ అలవాటు వారిలో నడిచే శక్తి హరించిందని అద్యాయిన కారులు దృవీకరించారు. కండరాళ్ళల్లో కదలిక తగ్గి పై శరీర భాగాలు సక్రమంగా పని చేయకుండా పోయాయని తేలింది.అంచేత ఎన్నేసి గంటలు టీ.వి చూస్తున్నారు లేక్కలేసుకుంటే మంచిదేమో!
Categories