ఇరాక్ లోని నోబెల్ శాంతి బహుమతి అందుకున్న మొదటి వ్యక్తిగా నదియా గుర్తింపు పొందింది. యుద్దం దాడుల్లో ఆడవాళ్ళ పై లైంగిక హింసను ఆయుధంగా వాడుకోవడం సరికాదని యాజని అనే తన తెగని సమూలంగా నాశానం చేయాలనుకున్న ఉగ్రవాదుల పై పోరాటం చేస్తున్న కృషికి గుర్తింపుగా నదియాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కోజి ప్రాంతంలో యాజని అన్న తెగను నాశానం చేయాలనే ఉద్దేశ్యంతో చుట్టుముట్టి ఆడవాళ్ళు,పసి వాళ్ళ పైన దాడులు చేశారు.అలాంటి వారి చేతిలో పడింది నదియా.ఎన్నో మానసిక శారీరక హింసలకు గురైన నదియా పారిపోయి శరణార్ధిగా మారి అటు తర్వాత తన తెగను కాపాడే ప్రయత్నంలో చేసిన కృషికి గాను ఆమెకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది.ఈమె గురించి పూర్తి పాఠం వికీపిడియాలో చదువుకోవచ్చు,