నడుము వంపుల్లో ఏ మాత్రం కొవ్వు చేరకుండా, కండరాళ్ళు ఉచ్చికనబడకుండా ఉంచుకోవడంఎవరికైనా ఇష్టమే. అయితే అలా అని ఊహల్లో వుంటే నాజుగ్గా వుండే నడుము సొంతం అయిపోదు. ఈ విషయంలో ఆహారం, వ్యాయామలకే ఆన్ లైన్ కీలక పాత్ర. ప్రాసెస్డ్ పదార్ధాల్లో చక్కర, ఉప్పు, ప్రిజర్వేటివ్ లు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ తో నిండి వుంటాయి కనుక ప్యాకెట్, టిన్, బాటిల్డ్ పదార్ధాలకు దూరంగా వుండాలి. పానీయాలకు దూరంగా పెట్టాలి. రిఫైండ్ ఫ్లోర్ తో చేసే వైట్ బ్రెడ్, రోటీలు, బేకరీ ఉత్పత్తులు డెజర్ట్ లు, స్వీట్లకు గుడ్ బయ్ చెప్పేయాలి. తాజా కూరగాయలు పండ్లు తినాలి. ఉప్పు బదులు నిమ్మరసం, సుగంధ దినుసులు, హెర్బ్స్ ప్రత్యామ్నాయం చేసుకోవాలి. మంచి ప్రోటీన్ చాల అవసరం. ఇలా ఫుడ్ విషయంలో శ్రద్దగా వుండి కనీసం 40 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేస్తే చక్కని నడుముత్ నాజుగ్గా కనబడొచ్చు.
Categories