నెయ్యి తిరుగు లేని సాత్విక ఆహారం అంటారు. అందాన్ని,నాజూకు తనాన్ని ఇస్తుంది నెయ్యి. ఇది ఫ్యాటీ ఫ్యామిలీ వరుసలో లేదు. విటమిన్ ‘ఇ’ గుండెకు ప్రయోజనం. ఈ విటమిన్ ను గ్రహించేందుకు నెయ్యి అవసరం. నెయ్యి లేకపోతే చర్మం పొడి బారి పోతుందన్నది వాస్తవం. శిరోజాలకు,కళ్ళకు చర్మానికి అవసరం అయ్యే విటమిన్ ‘ఏ ‘ ని శరీరం గ్రహించటానికి కొవ్వు అవసరం. నెయ్యిలో లాక్టోజ్ వుండదు. చెడు కొలెస్ట్ రాల్ అయిన ఎల్  కొలెస్ట్ రాల్ ప్లాస్మ ను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు సంవృద్ధిగా ఉండి శరీరంలోని అన్ని టిష్యూ లేయర్లకు వాటిని అందించి రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది. ఎన్నో ఔషధ విలువలున్న నెయ్యి రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది. ఇవి వెన్న అంటే సురక్షితం. నూనె కంటే పోషక భరితం. మిగతా వెజిటబుల్ నూనెల్లో కంటే  స్మాకింగ్ పాయింట్ పై స్థాయిలో ఉంటుంది. కనుక వేపుడుకు సరైనది. ఎంతో ఎక్కువ సెగలో కూడా దీని రసాయన గుణం మారదు. ఫ్రిజ్ లో పెట్టనవసరం లేకుండా ఎంతో కాలం నిల్వ ఉంటుంది. పాలపైనా మీగడను తీసి విడిగా తోడుపెట్టాలి. ఈ తోడుకున్న మీగడను బ్లెండర్ తో చిలికితే వెన్న పేరుకొని పైకి వస్తుంది. దీన్ని సన్నని మంటపైన కాగనిస్తే కమ్మని వాసన తో నెయ్యి తయారవుతోంది. నేతితో అన్ని పదార్ధాలకు రుచి వస్తుంది. హాల్వా వంటి తీపి డిజర్ట్ లకు నెయ్యి ప్రధాన అధరావు. శరీరంలో కొవ్వు పేరుకుపోతోందని ఎంతో మంది సందేహ పడుతారు గానీ ఇది కేవలం అపోహ ! చక్కగా నెయ్యితో భోజనం చేస్తే రుచి ఆరోగ్యం కూడా.

Leave a comment