“రథ సప్తమి” శుభాకాంక్షలు !!

ఆదిత్యుడిని అనగా సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవముగా పూజ చేసి వద్దాం పదండి సఖులూ!!
ఈనాడు ముఖ్యంగా సంక్రాంతికి పెట్టిన ముగ్గులలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఈ రథసప్తమి నాడు సూర్య నారాయణ స్వామి వారి సన్నిధిలో ఆ పిడకలపై కొత్త గిన్నెలో, కొత్త బియ్యం,ఆవుపాలతో పొంగలి చేసి సమర్పించుకుంటారు.
సూర్య నారాయణ స్వామి ఏడు సంఖ్య అంటే చాలా ప్రీతి.ఆయన ఉత్తర దిశగా సప్త అశ్వాలతో రథము పై వస్తారు.ఈ రథసప్తమి నాడు జిల్లేడు ఆకులు,రేగు పండ్లతో అభ్యంగనం చేసిన శరీర ఉష్ణోగ్రతలకు చాలా మంచిది.చిక్కుడ కాయలతో రథము తయారుచేసి స్వామిని ఆహ్వానించి తరిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,ఆవుపాలతో చేసిన పొంగలి.

తోలేటి వెంకట శిరీష

Leave a comment