సాధారణంగా మనింట్లో మనకి పనికి రాని వస్తువులుంటే ఇంట్లో అడ్డంగా ఎందుకు అనుకుని పారేస్తాం. కానీ అలాంటి పనికి రాని చెత్తను కూడా పనికొచ్చే కళాఖండాలను చేస్తారు ఇంకొందరు. అవి పర్యాటక ప్రదేశాలైతే ఎలా వుంటుందీ ? ఎల్మార్ లాంగ్ అనే వ్యక్తికి పనికి రాని  వస్తువులు సేకరించే అలవాటుంది, వాళ్ళ నాన్న కూడా ఇతనితో కలిసి ఎన్నో వస్తువులు సేకరించార. తండ్రి చనిపోయాడు . ఎల్మార్ చుట్టూ ఎన్నో పనికిరాని ఇనుప వస్తువులు సీసాలు బోలెడన్ని పోగుపడి వున్నాయి. బాగా ఆలోచించి ఒక కడ్డీ కి ఎన్నో సీసాలు అతికించి చూసాడు. ఎండలో ఎన్నో రంగులతో ఆ సీసాల చెట్టు మెరుస్తోంది. ఇంకంతే సేకరించిన సీసాలకు వందలాది సీసాల చెట్లు తయారు చేసాడు. వాటికీ బాటిల్ ట్రీరంచ్ అని పేరు పెట్టాడు. ఈ చెట్ల అందం చూడాలంటే కాలిఫోర్నియా లోని మోజావే కౌంటీ కి వెళ్ళాలి. ఈ ఇమేజెస్ అన్నీ సరదాగా చూడండి. అన్నిట్లో ఈ సీసాచెట్లని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారట.

Leave a comment