అందమైన అధునాతనమైన ఇళ్ళు నిర్మించుకునే వాళ్ళు ప్రపంచం మొత్తంగా ఉన్నారు. కానీ ఏరికోరి బురద మట్టి,మంగళూరు ఎర్ర పెంకుల తో ఇల్లు కట్టుకొని మురిసిపోతున్నారా? అంటే పూణెకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లు అన్విత్ పాథక్ దంపతులను చూపించ వచ్చు. మేం రెండు అంతస్థుల మట్టి ఇల్లు కట్టుకున్నాం. వీలైనంత ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన మెటీరియల్ ఉపయోగించారు. ఆ మెటీరియల్ వాసన బ్రీతింగ్ సమస్యలను కూడా దూరం చేస్తుంది ఎండా కాలం బయట ఉష్ణోగ్రత కంటే 13,14 డిగ్రీలు తక్కువే ఉంటుంది ,పైగా ఈ మడ్ హౌస్ నిర్మాణ వ్యయం కూడా చాలా తక్కువ అంటున్నారు. ఈ దంపతులు పర్యావరణాన్ని ప్రేమించేవాళ్ళు ఎక్కువవుతున్నకొద్దీ ఇలాంటి పర్యావరణ హితంగా ఉంటే నిర్మాణాలు ఎక్కువవుతున్నాయి.

Leave a comment